భారతదేశం, జనవరి 10 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్‌ను అప్పు డౌట్ పడితే స్వప్న రచ్చ చేస్తుంది. ఆపమని అరుస్తుంది ఇందిరాదేవి. ఇంతలో నర్స్ వచ్చి సైలెంట్‌గా ఉండమని చెబుతుంది. మరోవైపు ధర్మేంద్ర భార్యను డాక్టర్ చక్రవర్తి టెస్ట్ చేస్తాడు. కడుపులో బిడ్డ గురించి మాట్లాడుకుంటారు.

ఇదివరకు కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డ మీద ఎలాంటి ఆశలు ఉంటాయో ఆలోచించు అని ధర్మేంద్ర అంటాడు. ఈసారి బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని చక్రవర్తి అంటాడు. హాస్పిటల్‌ మీది. గతంలో రెండుసార్లు మీకు బిడ్డను అందించలేదని చాలా బాధపడ్డాం. కానీ, ఈసారి త్వరగానే హాస్పిటల్‌లో జాయిన్ చేయించండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

మినిస్టర్ ధర్మేంద్ర భార్య వచ్చి భయంగా ఉందంటే భర్త ఓదారుస్తాడు. ఇప్పుడు ఇది ఆఖరుసారి అని డాక్టర్స్ చెప్పేశారు. ఈసారి బిడ్డను చూసుకో...