Hyderabad, ఏప్రిల్ 28 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో తన ఇంటికి రావడం గురించి రాజ్ చెబుతాడు. ఈ ఇంటితో నాకు ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకేనేమో నా సిక్త్ సెన్స్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అయినా ఇదేంటండి ఇంటికి వచ్చిన గెస్ట్‌ను గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు అని రాజ్ అంటాడు.

దాంతో ఇంట్లోకి పిలుస్తుంది కావ్య. ఇల్లు చాలా బాగుందని రాజ్ అంటే.. మా తాతయ్య గారు ఇష్టపడి కట్టుకున్నారని కావ్య అంటుంది. ఇది తీసుకోండి. ఒక చిన్న గిఫ్ట్ అని రాజ్ అంటాడు. హో ఇది ఇవ్వడానికి వచ్చారా. ఇచ్చేసి వెళ్లిపోతారా అని కావ్య అంటుంది. ఇంటికొచ్చిన గెస్ట్‌కు కాఫీ, టీ కూడా ఇవ్వరా అని రాజ్ అంటే.. పాలు అయిపోయాయని చెబుతుంది కావ్య.

రాజ్ నీళ్లు ఇవ్వమంటాడు. ఈయన నాతో టైమ్ స్పెండ్ చేయడానికే వచ్చారు. పంపించాలని లేదు. అలా అని ఇక్కడ ఉంచేంత అవకాశం...