Hyderabad, ఏప్రిల్ 26 -- ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ఇచ్చిన అడ్రస్ పొడుపు కథ విప్పినట్లు రాజ్ చెబుతాడు. మణికొండ పైప్ లైన్ దగ్గర సూర్యుడి టెంపుల్ ఉంది. సూర్యుడి టెంపుల్ నీడ పడే చోటు దగ్గరేగా మీ ఇల్లు అని రాజ్ అంటే.. అదెక్కడ ఉందని మనసులో అనుకున్న కావ్య కరెక్ట్ అండి. భలే కనుక్కున్నారు అని కావ్య అంటుంది.

నేను రేపు నేరుగా మీ ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్ అవుతారు అని రాజ్ అంటాడు. రేపు ఎవరి ఇంటికి వెళ్తారు. అక్కడ కుక్క ఉండకుండా చూడు స్వామి అని కావ్య మనసులో అనుకుంటుంది. కరెక్ట్‌గా వస్తారా అని కావ్య అడిగితే.. మ్యాప్ అయినా తప్పుతుందేమో గానీ నేను కాదు. రేపు నేను వచ్చాక సంబ్రమాశ్చర్యాలకు గురికాండి అని రాజ్ అంటాడు.

సరే సరే రండి అని కావ్య కాల్ కట్ చేస్తుంది. పాపం పిచ్చి మహరాజు అడ్రస్ తప్పుగా చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. రేపు ఏ ఇంటిక...