Hyderabad, ఏప్రిల్ 25 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యపై పవర్ ఆఫ్ అటార్నీ రావడంపై ఇంట్లో అంతా షాక్ అవుతారు. కావ్య ఫోర్జరీ చేసిందని రుద్రాణి గొడవ చేస్తుంది. నీకంటే ముందు డాక్యుమెంట్స్ నా చేతికి ముందు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నావా. డాక్యుమెంట్స్ నవ్య జూలర్స్ వాళ్లకు పంపావ్. వాళ్లు బ్యాలెన్స్ క్లియర్ చేశారు. దాంతో కంపెనీ పేరు మీద ఉన్న డ్యూస్ అన్ని క్లియర్ చేశావ్. ఇంటి పరువు కాపాడావ్. బాగుంది సూపర్ అని రుద్రాణి అంటుంది.

కానీ, రాజ్ చేయాల్సింది అంతా నువ్ చేశావ్. కానీ, రాజ్ లేకుండా నీ చేతికి పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వచ్చింది అని నిలదీస్తుంది రుద్రాణి. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చిన దుగ్గిరాల కుటుంబం అని డైలాగ్స్ కొడుతుంది. ఆ పేపర్స్ ఎలా వచ్చాయని ఇందిరాదేవి, సీతారామయ్య అడుగుతారు. కంపెనీ ఎండీ లేకుండా వేరొకరి పేరు మీదకు రాయలేరు ...