Hyderabad, ఆగస్టు 8 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప శకునాలు మాట్లాడకు. కావ్య ఏడుస్తూ వెళ్లింది వాడికేమో అయిందని కాదు. రాజ్ దొరికాడని వెళ్లింది అని ఇందిరాదేవి అంటుంది. అడ్రస్ పెట్టమను, మనం కూడా వెళ్దాం అని సుభాష్ అంటాడు. వాడు కావ్య మీద కోపంతో వెళ్లాడు. ఇప్పుడు మనం వెళ్తే సరిగా మాట్లాడలేరు. వాళ్లు మాట్లాడుకోని అని ఇందిరాదేవి ఆపుతుంది.

ఇక లేట్ చేసి లాభం లేదు అపర్ణ. కావ్య ప్రేమ యాక్సెప్ట్ చేయనందుకే వెళ్లిపోయాడు. అలాంటిది రేపు వాడికి మనమే కన్న తల్లిదండ్రులను తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని సుభాష్ అంటాడు. వీళ్లేంటీ సడెన్‌గా ట్విస్ట్ ఇస్తున్నారు. వెంటనే ఈ విషయం యామినికి పోస్ట్ చేయాలి అని రుద్రాణి అనుకుంటుంది. యామినికి కాల్ చేసి వీళ్లు రాజ్‌కు నిజం చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఆ తర్వాత నువ్వేం చేయలేవు అని రుద్రాణి అంటుంది.

ఏం చేయా...