Hyderabad, ఆగస్టు 7 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంట్లో అంతా కావ్య మీద కోపంగా ఉంటారు. సీతారామయ్యకు కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజ్‌తో ఎందుకు అలా ప్రవర్తించావమ్మా. నా మనవరాలు తప్పు చేయదు అనుకున్నా. కానీ, నిన్నటితో నా ఆలోచన తప్పు అనేలా చేశావు. నేను కారణం అడగను. అది నీ జీవితానికి సంబంధించిన విషయం అని సీతారామయ్య అంటాడు.

జీవితం గాజు లాంటిది. చేయి జారాక కాపాడుకోలేం. నీ చేతులారా నువ్వే బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నావ్. నువ్వే ఆ యామినికి ఇంకో ఛాన్స్ ఇచ్చావ్. ఎందుకు అలా చేశావ్ అని సీతారామయ్య అడిగితే.. చెప్పలేను అని మనసులో అనుకుని సైలెంట్‌గా ఉంటుంది. మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదని కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో కావ్య అంటూ యామిని వచ్చి అరుస్తుంది.

ఎందుకొచ్చావ్ అని అడుగుతారు. మా బావ ఎక్కడ, రాజ్ ఎక్కడ, ఎక్కడ దాచిపెట్టారు...