Hyderabad, ఆగస్టు 5 -- బ్రహ్మముడి సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపేలా సాగుతోంది. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 5) 792వ ఎపిసోడ్ లో కొన్ని ఊహించిన ఘటనలు జరిగాయి. రాజ్ ప్రేమను తిరస్కరించడమే కాదు.. అతన్ని దారుణంగా అవమానిస్తుంది కావ్య. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

రాజ్ ప్రపోజల్ ను కావ్య తిరస్కరించే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కావ్య తెగేసి చెబుతుంది. ఎందుకు ఇష్టం లేదని ఇంట్లో వాళ్లు అడుగుతారు. ఆయన ఇష్టపడితే నేనూ ఇష్టపడాలా? తాళి కడతా అంటే తల వంచుకొని కట్టించుకోవాలా అని అంటుంది. ఆమెను అపర్ణ, ఇందిరాదేవి మందలించబోతే.. రాజ్ జోక్యం చేసుకుంటాడు.

ఇది తనకు, కళావతికి మధ్య సమస్య అని.. దీనిని తామే పరిష్కరించుకుంటామని రాజ్ అంటాడు. మీరు బలవంతం చేసి తనను ఒప్పించడం ఇష్టం ...