Hyderabad, ఆగస్టు 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు తాను ప్రెగ్నెంట్ అని తెలిసి బాధపడుతుంది. ఇంతలో అప్పు వస్తే కావ్య హగ్ చేసుకుని బాధపడుతుంది. ఇదేంటీ చేతిలో అని ప్రెగ్నెన్సీ కిట్ చూసి అప్పు కూడా చాలా సంతోషిస్తుంది. ఇది నిజమా అక్కా అని అప్పు అంటే అవును, నేను తల్లిని కాబోతున్నాను అని కావ్య అంటుంది. కంగ్రాట్స్ అని చెప్పి హగ్ చేసుకున్న అప్పు అసలు బావ మీరు ఎప్పుడు కలిసారు అని అడుగుతుంది.

రెండు నెలల ముందు ఆయనకు గతం మర్చిపోకముందు బూత్ బంగ్లాలో కలుసుకున్నాం అని కావ్య చెబుతుంది. ఈ విషయం అందరికి చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అని అప్పు అంటే ఆయన నాకు ప్రపోజ్ చేద్దామని చాలా సంతోషంగా వస్తున్నారు. దీనికి కారణం మీరే అని చెప్పాలా. అసలు నేను చెప్పగలనా. ఆయనకు నిజం తెలియాలంటే గతం గుర్తుకురావాలి. అలా చేస్తే సమస్య అని డాక్టర్ చెప్పారు అని కావ్య...