Hyderabad, ఆగస్టు 30 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌కు గతం గుర్తుకు రావడంతో యామిని పిచ్చిదానిలా చేస్తుంది. రాజ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో తల్లిదండ్రులకు చెబుతుంది. కావ్యను వదలను, దాని అంతు చూసి రాజ్‌ను సొంతం చేసుకునే వరకు ఊరుకోను అని యామిని అంటుంది.

నోర్మూయ్. ఇంత జరిగాక నీకు బుద్ధి రాలేదా. ఇకనైనా మా మాట విను. నీకోసం ఎన్ని పిచ్చి పనులు చేసిన ఊరుకున్నాం. ఇన్నాళ్లు ఓ నమ్మకం ఉండేది. కానీ, ఈరోజుతో అర్థమైంది. రాజ్ కావ్య సొంతమే. ఇకనైనా పిచ్చి ప్రయత్నాలు ఆపు. కొత్త జీవితం ప్రారంభించు అని యామిని తండ్రి రఘునందన్ సలహా ఇస్తాడు.

నేను వినను. కొత్త జీవితం ప్రారంభించను. రాజ్ లేని జీవితం నాకు వద్దు. కావాలంటే చచ్చిపోతాను. నాకు రాజ్ కావాలి రాజ్ కావాలి అని పిచ్చిదానిలా అరుస్తుంది యామిని. నువ్ అడిగింది మనిషి ప్రేమ. దాన్ని ఎంత ఖర్చు పెట్టి...