Hyderabad, ఆగస్టు 22 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అమెరికా వెళ్తున్నట్లు నాటకం ఆడుతున్న రాజ్‌ను రుద్రాణి కలుస్తుంది. కళావతి కాకుండా మీరు వచ్చారేంటీ అని రాజ్ అంటే.. తను రాలేదు. నిన్ను ఫేస్ చేయలేదు. నిజం చెప్పలేదు. నేను కూడా చెప్పలేను అని రుద్రాణి అంటుంది.

నిజం చెప్పనప్పుడు ఎందుకు వచ్చారు అని రాజ్ వెళ్లిపోతుంటే.. కళావతి కడుపుతో ఉందని రుద్రాణి చెబుతుంది. దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయి ఆగిపోతాడు. కళావతి కడుపుతో ఉంది. ఆ నిజం చెప్పలేక. నీతో పెళ్లికి ఒప్పుకోలేక బాధపడుతుంది అని రుద్రాణి చెబుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. నువ్ ప్రెగ్నెంటా అని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది.

నన్ను క్షమించు కళావతి. రామ్‌ను ఆపేందుకు నిజం చెప్పక తప్పలేదు అని రుద్రాణి అంటుంది. కానీ, రాజ్ మాత్రం తెగ నవ్వుతాడు. ప్లాన్ అదిరిపోయింది కళావతి గారు. దీనిక...