Hyderabad, ఆగస్టు 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇందిరాదేవి మాట జారడంతో రుద్రాణి అనుమానిస్తుంది. నిజంగానే వాడికి ఇంటితో సంబంధం ఉందా అని డౌట్ పడుతుంది రుద్రాణి. స్వరాజ్‌కు ప్రేమగా అపర్ణ దోశలు తినిపిస్తుంది. అది చూసి చాలా సంతోషంగా ఉందని ఇందిరాదేవి అంటే.. నాకు మాత్రం జాలిగా ఉందని రుద్రాణి అంటుంది.

ఇంట్లో కోడలు ఉండగా మనవళ్లు లేరు, బయటి వాళ్లను ప్రేమగా చూడాల్సి వస్తుంది. ఇక రేవతి ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు. రాజ్, కావ్య చెరో దిక్కు ఉన్నారు. వదినకు మనవళ్లను ఎత్తుకునే యోగం ఉందో లేదో అని రుద్రాణి అంటుంది. దాంతో ప్రకాశం కౌంటర్స్ వేస్తాడు. రాజ్, కావ్య త్వరలోనే ఒక్కటవుతారని, అంతరకు కుళ్లుపోతుతోనే కడుపు నింపుకోమని అంటాడు.

కావ్య బాధగా చూస్తుంది. ఇంతలో అప్పు వచ్చి స్వరాజ్ తల్లిదండ్రులు దొరికారట అని చెబుతుంది. వాళ్లు ఎవరో తెలుసుకోవచ్చు అని రు...