Hyderabad, ఆగస్టు 18 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వరలక్ష్మీ వ్రతానికి కావ్య, స్వప్న, అప్పు సంతోషంగా పూలు కడుతుంటారు. అది చూసి ఓర్వలేని రుద్రాణి వీళ్లను సంతోషంగా ఉంచొద్దు అనుకుంటుంది. స్వరాజ్‌ను చూసి వీడిని అడ్డుపెట్టుకుని కావ్య కడుపుతో ఉందన్న విషయం బయటపెడదాం అని రుద్రాణి అనుకుంటుంది.

స్వరాజ్ కంగ్రాట్స్

వెళ్లి స్వరాజ్‌కు నీకు చాక్లెట్ ఇచ్చిన కావ్య ఆంటీ కడుపుతో ఉంది. వెళ్లి కంగ్రాట్స్ చెప్పు అని అంటుంది రుద్రాణి. దాంతో స్వరాజ్ వెళ్లి కంగ్రాట్స్ చెప్పి, కడుపుతో ఉన్నావుగా అని అంటాడు. దాంతో అంతా అవాక్కయి చూస్తారు. రాజ్ కూడా వెంటాడు. నువ్ నాకు త్వరలో ఫ్రెండ్‌ను కూడా ఇస్తున్నావుగా. అందుకే కంగ్రాట్స్ చెప్పాను. నువ్ చెప్పకపోయినా నేను తెలుసుకుని వచ్చి చెబితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని స్వరాజ్ మాట్లాడుతునే ఉంటాడు.

అరేయ్.. నా కూత...