Hyderabad, ఆగస్టు 16 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి కావ్య ఎర్ర చీర కట్టుకుని రెడీ అయి వస్తుంది. కావ్యను చూసి రాజ్ ఫిదా అవుతాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆ అమ్మవారికే పూజ చేయడానికి వచ్చిన దేవకన్యలా ఉన్నారు అని రాజ్ అంటాడు.

మా కళ్లముందే కావ్యకు పబ్లిక్‌గా సైట్ కొడుతున్నావ్ అని స్వప్న అంటుంది. వ్రతం అన్నారు మీకేం పని లేదా అని రాజ్ అంటాడు. దాంతో అర్థమైందని అంతా వెళ్లిపోతారు. మీరు చాలా అందంగా ఉన్నారని కావ్యకు రాజ్ చెబుతాడు. మీరెందుకు వచ్చారని కావ్య అంటే.. నాకోసం మావయ్య వచ్చాడని, కావాలంటే చెప్పండి ఇద్దరం వెళ్లిపోతామని స్వరాజ్ అంటాడు.

వెళ్లిపోమ్మని కావ్య అంటుంది. అయితే, ఆరోజు గుడిలో నువ్ నేను తప్పిపోయినట్లు నటించడానికి చాక్లెట్ ఇచ్చావుగా. అది నా ఫ్రెండ్‌తో చెబితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా అని స్వరా...