Hyderabad, ఆగస్టు 1 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు (ఆగస్ట్ 1) 789వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దుగ్గిరాల ఇంట్లో రేవతి కొడుకు మెల్లగా అందరికీ దగ్గరవుతుంటాడు. అదే సమయంలో వాడు ఎవడో ఇందిరా దేవి చెప్పేస్తుంది. అయితే అనుకోకుండా ఆమె నోరు జారడం, దానిని కవర్ చేయడానికి కావ్య తంటాలు పడటంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ అంతా రక్తి కట్టింది.

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 1) ఎపిసోడ్ కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయబోతుండగా మొదలైంది. నిన్ను నిన్ను అని అంటుండగా ప్రకాష్ వస్తాడు. దీంతో రాజ్ కంగారు పడుతూ వెళ్లిపోతాడు. వాడు నీ భర్తే కదా మళ్లీ ఇదేంటని అడుగుతాడు. ఆయనకు గతం గుర్తు లేదు కదా.. మీరు ఇలా మరచిపోయి ఆయన ముందు ఈ విషయం చెప్పారంటే ఇక అంతే అని కావ్య అంటుంది.

అటు స్వరాజ్ అపర్ణ దగ్గరికి పడుకోవడానికి వెళ్తాడు. తనకు కథ చెప్పాలంటాడు. ఆమె రాజు, ఏడు చేపల కథ మొదలుపెట్టేసరి...