Hyderabad, ఆగస్టు 6 -- బ్రహ్మముడి సీరియల్ 793వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ సీరియల్ ప్రస్తుతం ఊహకందని మలుపులతో సాగుతోంది. కావ్య, రాజ్ జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 6) ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఆగస్టు 6) ఎపిసోడ్ రాజ్ తో అపర్ణ, ఇందిరా దేవి మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. కావ్య రిజెక్ట్ చేయడంతో రాజ్ బాధపడుతూ ఉంటాడు. అసలు కావ్య ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదని వాళ్లు అంటారు. తానే తప్పుగా అర్థంగా చేసుకున్నానని, తన మనసు తెలుసుకోకుండా సాయం కోరడాన్నే ప్రేమ అనుకున్నానని రాజ్ అంటాడు. ఇన్నాళ్లూ తనకు గతమే లేదనుకున్నాను కానీ భవిష్యత్తు కూడా లేదని బాధపడతాడు.

కావ్యను నాలుగు తగిలించి అయినా సరే నీతో పెళ్లికి ఒప్పిస్తాం అని అపర్ణ అంటుంది. ఇష్టం లేని షర్టే వేసుకోం.....