Hyderabad, ఆగస్టు 21 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 806వ ఎపిసోడ్ మొత్తం రాజ్ అమెరికా డ్రామా చుట్టే తిరుగుతుంది. అతన్ని ఆపడానికి అపర్ణ, ఇందిరాదేవి చేసే ప్రయత్నాలు ఫలించకపోవడం, అటు కావ్యకు ఫోన్ చేసి యామిని రెచ్చగొట్టడం, చివరికి రుద్రాణి, కావ్య కలిసి రాజ్ కు అసలు విషయం చెప్పడంలాంటి సీన్లను చూడొచ్చు.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఆగస్టు 21) ఎపిసోడ్ రాజ్ అమెరికాకు బయలుదేరడానికి యామిని ఇంట్లో నుంచి బయటకు రావడంతో మొదలవుతుంది. శోభ అతన్ని వద్దని వారిస్తుంటే యామిని మాత్రం వెళ్లనీ మమ్మీ అని అంటుంది. అప్పుడే అక్కడికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. రాజ్ ను నిలదీస్తారు.

నన్ను దత్తత తీసుకోండి.. మీకు అండగా ఉంటానని అన్నావు.. ఇదేనా ఉండటం.. కళావతిని ఒప్పించకుండా ఇలా వెళ్లిపోవడం ఏంటి అని అడుగుతారు. అదే సమయంలో యామిని జోక్యం చేసుకొని వాళ్లపై మండిపడుతుంటే తన ప్ల...