Hyderabad, ఆగస్టు 20 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 805వ ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగిపోయింది. ఈ సీరియల్ ను ఓ కీలకమైన మలుపు తిప్పేందుకు ఈ ఎపిసోడ్ బీజం వేసింది. కావ్య గురించి రాజ్ అసలు నిజం తెలుసుకునే టైమ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందో అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేపింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ కావ్య దగ్గరికి వెళ్లి ధాన్యలక్ష్మి క్షమాపణ అడగడంతో మొదలవుతుంది. నీ గురించి నిజం తెలియక నానా మాటలు అన్నానని, తనను క్షమించమని కావ్యను అడుగుతుంది. పెద్దవారు, తెలియక అన్నారు.. మీరు క్షమాపణ అడగడం ఏంటని కావ్య అంటుంది. నీది చాలా గొప్ప మనసు కావ్య అని కూడా ప్రశంసిస్తుంది.

కానీ నీ పరిస్థితి ఎవరికీ రావద్దని, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి భర్త, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇలా మధనపడటం చూస్తే చాలా బాధేస్తోందని అంటుంది. నిన్...