Hyderabad, ఆగస్టు 19 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 804వ ఎపిసోడ్ ఈ సీరియల్ ను కీలక మలుపు తిప్పింది. రుద్రాణి ప్లాన్ పూర్తిగా కాకపోయినా సగం సక్సెస్ అవుతుంది. దీంతో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఆమె తల్లి కనకం బయటపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 19) ఎపిసోడ్ రాజ్ మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని కావ్యను అడిగే సీన్ తో మొదలవుతుంది. అయితే కావ్య మాత్రం మళ్లీ అలాగే కఠినంగా మాట్లాడుతుంది. మీరంటే నాకు ఇష్టం లేదని తేల్చి చెబుతుంది. ఒకవేళ పెళ్లి గురించే అడగాలని అనుకుంటే మళ్లీ ఈ ఇంటికి రావద్దని స్పష్టం చేస్తుంది. దీంతో రాజ్ బాధగా అక్కడి నుంచి స్వరాజ్ ను తీసుకొని వెళ్లిపోతాడు.

అటు వరలక్ష్మి వ్రతం సక్సెస్ కావడం, రాజ్ ద్వారానే కావ్యపై అక్షింతలు వేయించడంతో కనకం, అపర్ణ, ఇందిరాదేవి చాలా సంతోషంగా ఉంట...