Hyderabad, ఆగస్టు 14 -- బ్రహ్మముడి సీరియల్ గురువారం 800వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ మైల్ స్టోన్ ఎపిసోడ్ లో ఆ సీరియల్ ఓ కీలక మలుపు తిరగబోవడానికి సిద్ధమైంది. కావ్య ప్రెగ్నెంట్ అని రుద్రాణి తెలుసుకోవడం, అటు ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి వచ్చిన రేవతి కొడుకు కావ్య కొంప ముంచడంలాంటి సీన్లను చూడొచ్చు.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఆగస్టు 14) ఎపిసోడ్ అప్పూకి కల్యాణ్ జాగ్రత్తలు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అది చూసి ఎమోషనల్ అయిన కావ్య.. గతంలోకి వెళ్లిపోతుంది. తాను వాంతులు చేసుకోవడం, అది చూసి ఆమె ప్రెగ్నెంట్ అనుకొని రాజ్ హడావిడి చేయడం గుర్తు చేసుకుంటుంది. తాను ప్రెగ్నెంట్ కాదు.. నిన్న మీరు చేసిన వంటల ప్రయోగం వల్లే తనకు ఇలా జరిగిందని కావ్య అంటుంది. దీంతో రాజ్ ఉసూరుమంటాడు.

కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి ఆమె కంటతడి పెడుతూ గదిలోకి వెళ్లడం చూస్తారు...