Hyderabad, ఆగస్టు 13 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 799వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. రుద్రాణితో కావ్య, అప్పూ ఆడుకోవడం నుంచి.. పరోక్షంగా అత్తను స్వప్న బండ బూతులు తిట్టడం, చివరికి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం రుద్రాణి తెలుసుకోవడంలాంటి సీన్లతో రక్తి కట్టించింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఆగస్టు 13) ఎపిసోడ్ కావ్య, అప్పూ.. రుద్రాణితో ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. పుల్లటి మామిడి కాయలు ఎందుకు తింటున్నావని రుద్రాణి నిలదీయడంతో ఇవి పుల్లగా ఎక్కడున్నాయ్.. తియ్యగానే ఉన్నాయి కదా అంటూ అప్పూ అంటుంది.

కావ్యకు తినమని ఇవ్వగా ఆమె కూడా తియ్యగా, చక్కెరలా ఉన్నాయి కదా అంటుంది. అప్పుడే ఇందిరాదేవి అక్కడికి వస్తుంది. దీంతో మా అమ్మ తిని చెబుతుందంటూ ఆమెకు ఇస్తే.. ఆమె కూడా తియ్యగానే ఉన్నాయని కవర్ చేస్తుంది. దీంతో రుద్రాణి కోపంతో వెళ్లిపోతుంది. రుద్రాణితో జాగ్రత్త అ...