Hyderabad, ఆగస్టు 12 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 798వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ చాలా వరకూ అప్పూ, కావ్య ప్రెగ్నెన్సీల చుట్టూనే తిరిగింది. అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తో ఈ సీరియల్ కీలకమైన మలుపు తిరగబోతున్నట్లు స్పష్టమైంది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 12) ఎపిసోడ్ రాజ్ తాను అపార్థం చేసుకున్నానని తెలుసుకోవడంతో మొదలవుతుంది. కళావతిగారికి నిజంగానే క్యాన్సర్ లేదా అని అతడు అంటాడు. రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అపర్ణ అడుగుతుంది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాను అనుకుంటానని రాజ్ అంటాడు. ఇలా కాకుండా కాస్త మంచిగా ఆమెను గెలుచుకోవడానికి ప్రయత్నించు అని ఇందిరాదేవి చెబితే.. అలాగే ట్రై చేస్తానంటాడు.

అటు కల్యాణ్ తన రూమ్ లో కూర్చొని కవిత రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు అప్పూ వచ్చి తనకు పుల్లగా తినాలని ఉందని అంటుంది. కిచెన్ లో కిల...