Hyderabad, ఆగస్టు 11 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే ఆగస్టు 11న వచ్చిన 797వ ఎపిసోడ్ లో కావ్యను ఫాలో అవుతూ వెళ్లిన రాజ్ ఆమెకు క్యాన్సర్ అని, అందుకే తన ప్రేమను రిజెక్ట్ చేసిందని తెలుసుకుంటాడు. ఇంటి వరకూ వెళ్లి అపర్ణ, ఇందిరకు కూడా నిజం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఆగస్టు 11) ఎపిసోడ్ అపర్ణతో కావ్య తాను హాస్పిటల్ కు వెళ్తానని చెప్పే సీన్ తో ప్రారంభమవుతుంది. ఎందుకు అని అపర్ణ అడిగితే.. నిజంగానే కడుపులో బిడ్డ ఉందో లేదో తెలుసుకోవాలని అంటుంది. నిన్నే నువ్వు టెస్టు చేసుకొని పాజిటివ్ అని చెప్పావు కదా అని అపర్ణ అడిగితే.. మరోసారి డాక్టర్ తో కన్ఫమ్ చేసుకొని ఒకవేళ నిజమే అయితే బిడ్డ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెబుతుంది కదా అని కావ్య చెబుతుంది.

నిజమే.. అయినా అంతా బాగుంటే ఇది పండగ చేసుకోవాల్సి...