Hyderabad, అక్టోబర్ 9 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కల్యాణ్‌కు డాక్టర్ కాల్ చేస్తే.. రాజ్‌తో మాట్లాడిస్తాడు. డాక్టర్‌తో మాట్లాడిన రాజ్ కావ్యకు నిజం చెబితే ఒప్పుకోదేమోనని భయపడుతున్నట్లు చెబుతాడు. కావ్య ఐదో నెలకు దగ్గరిలో ఉందని, ఒక్కసారి ఐదో నెల వస్తే తల్లి, బిడ్డ ఇద్దరిని రక్షించలేమని, ఇద్దరిని కోల్పోతామని, వీలైనంత త్వరగా ఒప్పించండి అని డాక్టర్ చెబుతుంది.

వదినకు నిజం చెప్పేయమని కల్యాణ్ అంటే నిజం చెప్పి తనను దూరం చేసుకునేకన్నా ఈ అబద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఎలాగైనా తనను కాపాడుకుంటాను అని రాజ్ అంటాడు. మరోవైపు అప్పు కావ్య, రాజ్ మాట్లాడింది నిద్రలో కలవరించి అరుస్తుంది. ఈ గొడవలు ఇలాగే జరగుతాయ్. త్వరగా అక్కకు నిజం చెప్పేయాలని అప్పు లేస్తే.. ధాన్యలక్ష్మీ వస్తుంది.

అక్క దగ్గరికి అంటే అవసరం లేదని, జ్యూస్ తాగమని ఇస్తుంది ధాన్యలక్ష్మీ....