Hyderabad, అక్టోబర్ 8 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 846వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. దుగ్గిరాల కుటుంబంలో చీలిక వచ్చే పరిస్థితి కనిపించింది. ఇంటిపెద్ద సీతారామయ్య రాజ్ చెంప పగలగొట్టడం, ధాన్యలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతాననడం, విడాకుల కోసం కావ్య పట్టుబట్టడంలాంటి సీన్లతో ఎపిసోడ్ సాగిపోయింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ అప్పును చూపిస్తూ ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగొట్టే సీన్ తో మొదలవుతుంది. అప్పు ఇలా బాధపడుతూ కూర్చుంటే అబార్షన్ కావ్యకు కాదు నీ కోడలికి అవుతుందని చెప్పి వెళ్లిపోతుంది.

దీంతో ధాన్యంలో ఆందోళన మొదలవుతుంది. అప్పుడే కిందికి వస్తున్న కల్యాణ్ దగ్గరికి వెళ్లి అప్పును బయటకు తీసుకెళ్లమని, ఆమెను సంతోషంగా ఉండేలా చూడమని ధాన్యలక్ష్మి చెబుతుంది. అతడు సరే అంటూ అప్పు దగ్గరికి వెళ్లి ఆమెను ఒప్పించి బయటకు తీసుకె...