భారతదేశం, అక్టోబర్ 30 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌‌కు స్వప్న వల్ల వచ్చిన సమస్య గురించి చెబుతుంది కావ్య. రాహుల్ ఎవరినో తగులుకున్నాడు. ఇప్పుడు పాప పుట్టడంతో ఏం చేయాలో అక్కకు తెలియట్లేదు. తనతోనే తిరుగుతాను, తనతోనే ఉంటాను. అక్క అలా ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండాలి అని కావ్య చెబుతుంది.

రాహుల్‌తో నేను మాట్లాడుతాను. నువ్వు ముందు టిఫిన్ తిను అని కావ్యను బుజ్జగిస్తాడు రాజ్. మరోవైపు స్వప్న బాధపడుతూ ఉంటే రాహుల్ వచ్చి సెటైర్లు వేస్తాడు. ఈ తప్పులన్నింటికి మన మధ్య తెర దించుదాం. నేను నీతో కలిసి ఉండలేను అని డివోర్స్ పేపర్స్ ఇస్తాడు రాహుల్. దానికి స్వప్న షాక్ అవుతుంది. ఈ విడాకుల పేపర్స్‌పై ఒక్క ఆటోగ్రాఫ్ చేస్తే మన మధ్య బంధం తెగిపోతుంది. అప్పుడు నేను నా కొయిలితో ఉండిపోతాను అని రాహుల్ అంటాడు.

నీ చెంప పగులగొడతాను. విడాకుల పేపర్స్‌పై సంతకం పె...