Hyderabad, అక్టోబర్ 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నేను డాక్టర్‌ను కలవలేదన్న విషయం మీకెలా తెలుసు అని కల్యాణ్‌ను అడుగుతుంది కావ్య. దాంతో కల్యాణ్ తడబడతాడు. మీరు నన్ను ఫాలో చేశారా అని కావ్య అంటే.. అలా ఎందుకు చేస్తాను వదినా. గెస్ చేశాను. హాస్పిటల్‌కు వెళ్తే చెకప్‌లు, టెస్ట్‌లు చేస్తారుగా. త్వరగా లేట్ కాకుండా వస్తే గెస్ చేశాను అని వెళ్లిపోతాడు కల్యాణ్.

తర్వాత కల్యాణ్ మాట్లాడింది, అప్పటి వరకు జరిగింది అన్ని ఆలోచించినా కావ్య కల్యాణ్‌కు రాజ్ బిడ్డ వద్దనుకునే కారణం తెలిసే అవకాశం ఉంటుందని అనుమానిస్తుంది. ఒకవేళ తాను అనుకుంది తప్పు అయితే కల్యాణ్‌ను అనుమానించినట్లు బాధపడుతాడు. అలా కాకుండా నాకు అంతా తెలిసినట్లు చీకట్లో బాణం వేస్తే కల్యాణ్ బయటపడే ఛాన్స్ ఉంది. అలా చేద్దాం అనుకుని కల్యాణ్‌ దగ్గరికి వెళ్తుంది కావ్య.

మరోవైపు నీకు మరి ఇంత నోటి ...