భారతదేశం, అక్టోబర్ 29 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 864వ ఎపిసోడ్ మొత్తం రాజ్, కావ్య.. రాహుల్, స్వప్న చుట్టే తిరిగింది. తమ భార్యలను రాజ్, కల్యాణ్ ప్రేమగా చూసుకోవడం చూసి స్వప్న బాధపడుతుంది. విడాకుల వరకూ రాహుల్ వెళ్లడంతో ఆ సమస్యను ఇంట్లో వాళ్ల ముందు పెట్టి న్యాయం కోరుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఫస్ట్ నైట్ అంటూ రాజ్ తో కావ్య ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. పాల గ్లాసు, పట్టు చీరలో కావ్యను చూసి రాజ్ షాక్ తింటాడు. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారు అని రాజ్ అంటాడు.

ఫస్ట్ నైట్ కు ముహూర్తం కావాలి కానీ ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ అయిపోవచ్చు.. కడుపుతో ఉంటే కాపురం చేయొద్దన్నారా.. నేను ఉన్నన్నాళ్లూ మీతో ఇలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని కావ్య అంటుంది. ఆ మాటలు విని రాజ్ లబోదిబోమంటాడు. మధ్యలో కాసేపు ఇద్దర...