భారతదేశం, అక్టోబర్ 27 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో బిడ్డకు జన్మనిస్తే కావ్యకు ఏం కాదు అని డాక్టర్ చెప్పడంతో ఇంట్లోవాళ్లంతా సంతోషంగా ఉంటారు. వచ్చే వారసుడి గురించి మాట్లాడుకుంటారు. కావ్య ఎలా ఉండాలో ఇంటిల్లిపాది జాగ్రత్తలు చెబుతారు. కావ్య విశ్రాంతి తీసుకుంటుందని రాజ్‌ను గదిలోకి తీసుకెళ్లమంటారు.

దాంతో కావ్యను రాజ్ తీసుకెళ్తాడు. నాకోసం మన బిడ్డను కాదనుకునేంత ప్రేమ ఉందా. నాకోసం ఎంతో చేశారు. రోడ్డు మీద కూర్చొన్నారు. ఇంత ప్రేమ నేను కూడా మీకు చూపించలేనండి. ఏదైతేనే మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడిపోయాను. మీ గుండెల్లోని బారం దిగిపోయిందిగా. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లకు వారసుడు వస్తే మీ గురించి చెబుతాను. మీరు గొప్ప ఫైటర్ అని చెబుతాను అని కావ్య అంటుంది.

రాజ్ సీరియస్‌గా ఉంటే ఏంటండి ఇంకా అలా డల్‌గా ఉన్నారేంటండి అని అడుగుతుం...