Hyderabad, అక్టోబర్ 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‍కు కావ్య వెళ్తుంది. పేషంట్స్ ఉన్నారని, వాళ్ల తర్వాత వెళ్లాలని నర్స్ శాంతి అంటుంది. ఇంతలో శాంతికి డాక్టర్ కాల్ చేసి లోపలికి పిలుస్తుంది. కావ్య అనే పేషంట్ వచ్చిందా అని అడుగుతుంది. వచ్చారు. కానీ, వేరే పేషంట్స్ ఉన్నారు. కావ్య గారు వాష్ రూమ్‌కు వెళ్లారు అని నర్స్ శాంతి అబద్ధం చెబుతుంది.

సరే వేరే పేషంట్స్‌ను రమ్మను, కావ్య వచ్చాకా నాకు చెప్పు అని డాక్టర్ చెబుతుంది. సరే అని శాంతి కంగారుగా బయటకు వెళ్తుంది. కావ్యతో ఇంకా పేషంట్స్ ఉన్నారు. వెళ్లి ఏసీ రూమ్‌లో వెయిట్ చేయమని అంటంది శాంతి. నేను ఇక్కడే ఉంటాను. అయినా నా పేరు మీకెలా తెలుసు అని నర్స్‌ను అడుగుతుంది కావ్య. ఇందాక డాక్టర్ దగ్గర మీ అప్లికేషన్‌లో పేరు చూశాను అని కవర్ చేస్తుంది శాంతి.

తర్వాత రాజ్‌కు కాల్ చేసి మీ భార్య ప్రశ్న...