Hyderabad, అక్టోబర్ 14 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య పుట్టింట్లో రాత్రి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటుంది. తండ్రి కృష్ణమూర్తి వచ్చి మాట్లాడుతాడు. తాను చేస్తుంది తప్పో కరెక్టో అర్థం కావట్లేదు అని కావ్య అంటుంది. నువ్ నీ బిడ్డకోసం చేస్తున్న యుద్ధం ఇది. ఇందులో తప్పు ఎలా ఉంటుంది అని కృష్ణమూర్తి సపోర్టింగ్‌గా మాట్లాడుతుంది.

నీకు పెళ్లి చేసి పంపించేటప్పుడు మనకన్నా ధనవంతుల ఇంటికి పంపించాను. ఏదైనా అయితే వాళ్లను ఎదిరించే ధైర్యం కూడా నాకు ఉండేది కాదు. అలాంటిది నీ సహనం, ఓర్పుతో వారితోనే దుగ్గిరాల ఇంటి కోడలు అనిపించుకున్నావ్. ఇప్పుడు నీ జీవితంలో మొదలైంది రెండో అధ్యాయం. ఆ ఇంటి కోడలిగా చేస్తున్న పోరాటం కాదు. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధం అని కృష్ణమూర్తి అంటాడు.

నిన్ను అంతగా ప్రేమించిన మనిషి బిడ్డ ఎందుకు వద్దనుకుంటున...