Hyderabad, అక్టోబర్ 13 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్నకు కనకం కాల్ చేస్తే రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. కావ్యకు, రాజ్‌కు గొడవ ఏంటీ అని కనకం అంటుంది. నన్ను అడుగుతున్నావేంటీ. మీ ఇంటికి తప్పు చేసి వచ్చిన కూతురిని అడుగు అని రుద్రాణి అంటుంది. నా కూతురు తప్పు చేయదు అని కనకం అంటుంది. అంటే రాజ్ తప్పు చేశాడని అంటున్నావా అని రుద్రాణి అంటుంది.

నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని కాల్ కట్ చేస్తుంది కనకం. రుద్రాణి మాట్లాడింది విన్న స్వప్న తిడుతుంది. ఇంకోసారి తన ఫోన్ ముట్టుకోవద్దుంటుంది. మరోవైపు కావ్య పుట్టింటికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. కావ్య ఇంటికి ఎందుకు వచ్చింది, అల్లుడి గారిని ఎందుకు తిట్టి పంపించేసింది అని కనకం అడుగుతుంది. నీకు చెప్పలేదా అయితే మాకు చెప్పలేదు అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు.

తర్వాత కావ్య దగ్గరిక...