Hyderabad, అక్టోబర్ 10 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంకోసారి ఇంట్లో గొడవలు జరిగితే తాను వెళ్లిపోతానని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో బాగా ఆలోచించిన కావ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఆ విషయం తెలిసి అంతా రాజ్‌ను తిడతారు. కానీ, రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మీని నిందిస్తుంది. మరోవైపు రాజ్‌దే తప్పని అప్పు అంటుంది.

కావ్య బాధపడుతూ వెళ్లిపోతుంది. ఏది జరగాలని కోరుకున్నానో కరెక్ట్‌గా అదే జరిగింది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేసింది. రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని రుద్రాణి అనుకుంటుంది. అప్పుకు కల్యాణ్ జ్యూస్ తీసుకెళ్తాడు. కావ్యను ధాన్యలక్ష్మీ అన్న మాటల గురించి కోపంగా అడుగుతుంది అప్పు.

కావ్యను అంటదేంటీ. బిడ్డను తీసేసుకోమంటే ఏ తల్లి అయినా అలాగే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నిజం చెప్పకుండా తప్పు చే...