Hyderabad, అక్టోబర్ 1 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 840వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాజ్ తనకు కలిపిన జ్యూస్ లో అబార్షన్ ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలుసుకున్న కావ్య అసలు నిజమేంటో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆమెను అడ్డుకోవడంలో రాజ్ సక్సెస్ అయినా.. ఇటు కల్యాణ్ మాత్రం దొరికిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ రాజ్ తనకు కలిపిన మరో గ్లాస్ జ్యూస్ పై కావ్య డౌట్ పడటంతో మొదలవుతుంది. ఆ జ్యూస్ లో నిజంగానే ఏమైనా కలిపారా.. అసలు తనకు ఎందుకు ఇవ్వకుండా ఆగిపోయారు.. అది తాగితే తనకేమైనా అవుతుందని భయపడ్డారా అని కావ్య అనుకుంటుంది.

ఆ జ్యూస్ ను కావ్య టెస్టు కోసం ల్యాబ్ కు పంపిస్తుంది. దీని ద్వారా నిజం తెలుసుకోవడానికి కావ్య ప్రయత్నిస్తుంది. అందులో అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపారని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో కావ్య షాక్ తింటుంది. అయ...