Hyderabad, ఏప్రిల్ 24 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి గొడవ చేస్తుంది. రాజ్‌ను మాత్రం రప్పించరు. ఎవరిని పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. ఎవరు ఎవరిని చేయట్లేదు. మీకు కావాల్సింది డీల్ పూర్తి చేయడమేగా. 24 గంటల్లో డీల్ పూర్తి చేసి చూపిస్తాను అని కావ్య సవాల్ చేస్తుంది.

అవునా, ఎలా చేస్తావ్ అని రుద్రాణి అంటే.. ఎలా చేస్తే మీకెందుకండి. మీకు కావాల్సింది డబ్బులు. అవి తీసుకొచ్చి వాళ్లకిస్తా అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య అంటూ వెంటే అపర్ణ వెళ్తుంది. తెస్తా, సాధిస్తా అంటూ రోషంగా వెళ్లిపోయింది. కోట్లు అంటే రాజ్ వేసుకునే కోట్లు అనుకుంటుందా ఏంటీ అని రుద్రాణి అంటుంది. ఎందుకత్తా అంత తొందర. సాయంత్రం వస్తుందిగా. అప్పుడు క్లారిటీ వస్తుందిగా అని స్వప్న అంటుంది. అం...