Hyderabad, సెప్టెంబర్ 21 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కావ్యకు అబార్షన్ త్వరగా చేయాలని, లేకుంటే తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడలేమని డాక్టర్ చెబుతుంది. ఎలాగైనా కాపాడమని, స్పెషలిస్ట్‌లను చూడమని రాజ్ వేడుకుంటాడు. ఇదొక్కటే మార్గం తప్పా ఇంకోటి లేదని డాక్టర్ చెప్పడంతో ఫైర్ అవుతాడు రాజ్.

మీరేమైనా దేవుళ్ల అంటూ గొడవ పెట్టుకుంటాడు రాజ్. తర్వాత కల్యాణ్‌తో ఎలాగైనా ఇద్దరిని కాపాడాలని పిచ్చోడిలా ప్రవర్తిస్తాడు రాజ్. బిడ్డ చనిపోతుందని తెలిసి రాజ్ బెంబెలెత్తిపోతాడు. కంగారుపడతాడు. ఇంటికి వెళ్లిన రాజ్‌తో ఆఫీస్‌లో అర్జంట్ వర్క్ ఉందని, కోట్లల్లో నష్టం వస్తుందని, ఎలాగైన ఆఫీస్‌కు వెళ్లమని తండ్రి సుభాష్ ఫోర్స్ చేస్తాడు.

దానికి సుభాష్‌పై అరిచేస్తాడు రాజ్. తండ్రిపై మొదటిసారి రాజ్ అలా ప్రవర్తించేసరికి అంతా షాక్ అయి చూస్తారు. డబ్బు పిచ్చి పట్టింద...