Hyderabad, జూలై 20 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కావ్యను విచారించాలని యామిని తరఫు లాయర్ పీపీ అంటాడు. ఆమెకు కేసుకు సంబంధం ఉందని చెప్పడంతో జడ్జ్ ఒప్పుకుంటాడు. నీతోనే నీ చెల్లిని ఇరికించబోతున్నాను అని యామిని అంటుంది. కావ్య వచ్చి కోర్టు బోనులో నిల్చుంటుంది.

అప్పు లంచం అడిగిన శీను అనే వ్యక్తిని కలిసేందుకు మీరు ప్రయత్నించారా అని లాయర్ ప్రశ్నిస్తాడు. దానికి ఏం చెప్పాలో అర్థం కాక కలిసేందుకు ప్రయత్నించాను. కానీ, అతను మాకు దొరకలేదు. ఇంతలోనే కిడ్నాప్ అయ్యాడు అని కావ్య చెబుతుంది. దానికి పీపీ లాయర్ నవ్వుతాడు.

అప్పు లంచం అడిగిన శీనును కలిసి భయబ్రాంతులకు గురి చేసి తమకు నచ్చినట్లుగా చెప్పిద్దామని కావ్య ప్లాన్ చేసింది. అందుకే అతన్ని కలవడానికి అతని ఇంటికి వెళ్లింది. శీనుతో కావ్య మాట్లాడింది. కానీ, కావ్య డీల్‌కు శీను ఒప్పుకోలేదు. అప్ప...