భారతదేశం, నవంబర్ 11 -- ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా రాష్ట్రం వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు. అంతేకాదు 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు సీఎం.

మట్టిలో పుట్టిన మాణిక్యాలను సాన పెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బ్రహ్మంగారు చెప్పినట్టు కనిగిరి త్వరలోనే కనకపట్నం అవుతుందన్నారు. రిలయన్స్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రవరీస్ ప్లాంట్ ఇక్కడ ప...