Hyderabad, సెప్టెంబర్ 6 -- జాన్ విక్.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీ సరికొత్త అర్థం చెప్పిన మూవీ ఫ్రాంచైజీ ఇది. భార్య కుక్కను చంపినవాడి మీద హీరో రివేంజ్ తీర్చుకునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను తెచ్చిపెట్టింది.

ఇక జాన్ విక్‌గా స్టైలిష్ యాక్షన్ స్టంట్స్‌తో అదరగొట్టిన కీను రీవ్స్ మ్యాట్రిక్స్ మూవీ సిరీస్ తర్వాత అంతకుమించి పేరు తెచ్చుకున్నాడు. బాబా యాగాకా కీను రీవ్స్ నటించిన జాన్ విక్ స్ఫూర్తితో తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే, జాన్ విక్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చాయి.

ఎంతో క్రేజ్ తెచ్చుకున్న జాన్ విక్ ఫ్రాంచైజీ నుంచి స్పిన్నాఫ్‌గా వచ్చిన సినిమానే ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలెరినా. బ్యూటిఫుల్ హీరోయిన్ అనా డి అర్మాస్ ప్రధాన పాత్రలో హై ఓల్టేజ్ వయోలెంట్ ...