భారతదేశం, సెప్టెంబర్ 18 -- బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' విడుదలకు ఇంకా కొన్ని గంటలే ఉంది. కానీ హిందీ చిత్ర పరిశ్రమ నుండి కొంతమందికి నిన్న రాత్రి (బుధవారం) మొదటి ఎపిసోడ్‌ను చూసే అదృష్టం లభించింది. ముంబైలోని సెలబ్రిటీ స్నేహితుల కోసం షారుఖ్ ఖాన్, నెట్‌ఫ్లిక్స్ ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ ను ఏర్పాటు చేశారు.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్లు తమ ఒపీనియన్ చెబుతున్నారు. డైరెక్టర్ రాహుల్ ధోలాకియా ఫస్ట్ రివ్యూ పోస్ట్ చేశాడు. షారుక్ మూవీ 'రాయీస్'కు రాహుల్ డైరెక్టర్. "స్టార్ కాదు కానీ ***లు పుట్టారు!! ఆర్యన్ ఖాన్, నెట్ ఫ్లిక్స్ షో ఎంతో వినోదాత్మకంగా ఉంది. ఇది స్ఫూఫీ గూఫీ మొదటి ఎపిసోడ్!! భాయ్ బింగే కర్ణ పడేగా!!!" అని ఎక్స్ లో పోస్టు చేశా...