భారతదేశం, నవంబర్ 2 -- మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియా జోరు కొనసాగించింది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న భారత మహిళల జట్టు బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్లో బ్యాటింగ్ లో అదరగొట్టింది ఇండియా. 50 ఓవర్లో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది భారత్. షెఫాలి వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, ఓ సిక్సర్) రాణించారు.

భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ప్రపంచకప్ ఫైనల్ ను వరుణుడు కాస్త ఆలస్యం చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఈ టోర్నీలో అసలు తుది జట్టులో ఉంటుందో లేదో అనుకున్న షెఫాలి...