భారతదేశం, డిసెంబర్ 18 -- డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ, విభిన్నమైన స్టోరీలతో కూడిన సినిమాలతో జర్నీ సాగిస్తున్నాడు అడివి శేష్. అతను నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ డెకాయిట్. షానిల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ రాబరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా టీజర్ ను ఇవాళ (డిసెంబర్ 18) రిలీజ్ చేశారు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హీస్ట్ థ్రిల్లర్ డెకాయిట్ టీజర్ గురువారం రిలీజైంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ టీజర్ అడివి శేష్ పుట్టిన రోజు మరుసటి రోజు రిలీజైంది. నిన్న శేష్ బర్త్ డే. టీజర్ లో శేష్, మృణాల్ దేశీ బోనీ, క్లైడ్ పాత్రల్లాగా కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో టీజర్ అదిరిపోయింది.

డెకాయిట్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ లో నాగార్జున సినిమా పాట కన్నెపిట్టరో రీమి...