Hyderabad, జూన్ 17 -- మలయాళం థ్రిల్లర్ సినిమాలకు మీరు అభిమానులా? అయితే మీకోసం తెలుగులో అలాంటిదే ఓ హైస్ట్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు కొల్లా (Kolla). అంటే తెలుగులో దోపిడీ అని అర్థం. ఇప్పటికే ఈ మూవీ మలయాళం ఆడియోతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగులో రానుంది.

మలయాళం మూవీ కొల్లా తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జూన్ 19) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 17) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది.

"పర్ఫెక్ట్ క్రైమా? లేక పర్ఫెక్ట్ ట్రాపా? వాళ్లు అమాయకులుగా కనిపిస్తారు కానీ మాస్టర్‌మైండ్స్ లా ఆలోచిస్తారు. కొల్లా జూన్ 19 నుంచి తెలుగులో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

కొ...