భారతదేశం, జూలై 31 -- స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు నెల చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. వెన్స్‌డే సీజన్ 2 వంటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ లు రాబోతున్నాయి. అంతే కాదు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం హోస్టేజ్ కూడా రానుంది. ఇది మిస్టరీని ఇష్టపడేవారిని కట్టిపడేసే ఒక బ్రిటీష్ క్రైమ్ డ్రామా. యానిమేషన్ అభిమానులు బోజాక్ హార్స్‌మన్ సృష్టికర్త నుండి ఒక కొత్త సిరీస్‌ను కూడా చూడవచ్చు. సస్పెన్స్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ తో పాటు మరిన్ని అంశాలతో ఆగస్టు నెలలో ఆడియన్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ అలరించనుంది.

మరింత విధ్వంసం, భయానకమైన అందంతో నెట్‌ఫ్లిక్స్‌కు తిరిగి వస్తోంది వెన్స్ డే సిరీస్. జెన్నా ఒర్టెగా నెవర్‌మోర్ అకాడమీలో జీవితాన్ని గడుపుతున్న తెలివైన అమ్మాయి పాత్రను మళ్లీ పోషిస్తోంది. ఈ షో సీజన్ 2 రెండు భాగాలుగా విడుదల కానుంది. వాల్యూమ్ 1 ఆగస్టు...