Hyderabad, జూలై 30 -- అనసూయ భరద్వాజ్ బుధవారం (జులై 30) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. తాను ఎవరో కూడా తెలియని వాళ్లు సోషల్ మీడియా ఛానెల్స్ లో విమర్శిస్తూ వీడియోలు చేయడంపై ఆమె ఘాటుగా స్పందించింది. ఈ పోస్ట్ ద్వారా ట్రోలర్స్ కు ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. బోల్డ్ గా ఉంటే తప్పేంటని ప్రశ్నించింది. తాను స్వతంత్రంగా జీవిస్తున్నానని, ఎవరినీ తనను ఫాలో కావాలని చెప్పడం లేదని కూడా స్పష్టం చేసింది.

హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి అందులో ఘాటుగా స్పందించింది. "లవ్ ఆల్వేస్.. ఇతరులు నా గురించి వ్యాఖ్యానించినప్పుడు నేను తరచుగా మౌనంగా ఉంటాను. అయితే, నా జీవితాన్ని నేను జీవిస్తున్నందుకే విమర్శలు వచ్చినప్పుడు, నేను కోపగించుకోకుండా స్పష్టం...