భారతదేశం, జనవరి 27 -- 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. సండే, రిపబ్లిక్ డే హాలీడేస్ కలిసి రావడంతో వసూళ్లు అదరగొట్టింది. నాలుగు రోజుల్లోనే బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన బోర్డర్ 2 హైప్ ను కొనసాగిస్తోంది. ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా సాగిపోతోంది. బోర్డర్ 2 మూవీ నాలుగో రోజు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రూ.59 కోట్ల కలెక్షన్లు సాధించింది.

'బోర్డర్ 2' భారీ ఓపెనింగ్ అందుకుంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే రూ.30 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ అదరగొట్టింది. నాలుగో రోజు అంటే సోమవారం రూ.59 కోట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో బోర్డర్ 2...