భారతదేశం, జనవరి 23 -- ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా నిలిచిన 'బోర్డర్'కు సీక్వెల్‌గా వచ్చిన 'బోర్డర్ 2' (Border 2) ఈరోజు (జనవరి 23) థియేటర్లలో విడుదలైంది. రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో పేర్కొన్నారు. గురువారం (జనవరి 22) అర్ధరాత్రి దాటాక ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తరణ్ ఆదర్శ్ ఈ బోర్డర్ 2 సినిమాకు 4.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. "బోర్డర్ 2 మనసును గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. దేశానికి, సైన్యానికి ఈ సినిమా ఒక సెల్యూట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా" అని ఆయన రాసుకొచ్చారు.

దర్శకుడు అనురాగ్ సింగ్ ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన యుద్ధ ఇతిహాసాన్ని అందించారని ప్రశంసించారు. 1971 యుద్ధ స్ఫూర్...