భారతదేశం, జనవరి 2 -- 1997లో వచ్చిన 'బోర్డర్' సినిమాలో "సందేశే ఆతే హై" పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బోర్డర్ 2' (Border 2) కోసం ఆ పాటను రీక్రియేట్ చేస్తూ "ఘర్ కబ్ ఆవోగే" (Ghar Kab Aaoge) అనే ఆడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సోనూ నిగమ్, అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ కలిసి పాడటం విశేషం.

దేశభక్తి, సైనికుల త్యాగం, ఇంటిపై బెంగ.. ఈ ఎమోషన్స్ అన్నింటినీ కలిపి 1990ల్లో బోర్డర్ మూవీలో ఒక అద్భుతమైన పాటను అందించారు. ఇప్పుడు అదే పాటను కొత్త హంగులతో, నేటి తరం గాయకులతో కలిపి 'బోర్డర్ 2' మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. టీ-సిరీస్ (T-Series) సంస్థ ఈ పాటను విడుదల చేస్తూ.. దీన్ని "నేషన్స్ యాంథమ్" (Nation's Anthem)గా అభివర్ణించింది.

ఒరిజినల్ పాట పాడిన లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ తో పాటు.. ఇప్పటి సెన్సేషన్స్ అర్జి...