భారతదేశం, జనవరి 22 -- బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, సునీల్ శెట్టి, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ వీడియోపై స్పందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బోర్డర్ 2' సినిమాను తాను తప్పకుండా చూస్తానని రషీద్ ఖాన్ మాటిచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో క్రికెట్ సిరీస్ కోసం దుబాయ్‌లో ఉన్న రషీద్ ఖాన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఆ వీడియో క్లిప్‌లో రషీద్ ఖాన్ రోడ్డు పక్కన నిలబడి, బొగ్గుల కుంపటిపై మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ కనిపించాడు. ఈ వీడియోకు అతడు 'బోర్డర్ 2' సినిమాలోని 'ఘర్ కబ్ ఆవోగే' పాటను బ్యాక్‌గ్రౌండ్ లో యాడ్ చేశాడు. వీడియోలో అతడు నవ్వుతూ, మాట్లాడుతూ, కన్నుగీటుతూ, థంబ్స్ అప్ చూపిస్తూ సందడి చేశాడు.

ఆ క్లిప్‌ను షేర్ చేస్తూ.. "నేను బోర్డర్ 2 సినిమాను తప్పకుండా చూస్తా...