Telangana,hyderabad, జూన్ 26 -- హైదరాబాద్ నగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. ఆషాడ మాసం ప్రారంభమైన నేపథ్యంలో... బోనాల పండుగతో నగరానికి కొత్త శోభ సంతరించుకుంది. శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఇక్కడ సమర్పించే మొదటి బోనంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

ఇవాళ్టి నుంచి పలు తేదీలలో తొమ్మిది రోజుల పాటు బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇవాళ గోల్కొండలో మొదటి బోనం నుండి బోనాల సందడి ప్రారంభం అవుతుంది. పూజల...