Hyderabad, మార్చి 20 -- పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఇది దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆవు లేదా గేదె పాలు కంటే ఎక్కువ పోషకమైన ఆహారం లేదన అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వాటిని మించిన పోషకాహారం గురించి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే బొద్దింక పాలు. ఇది ఆవు పాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు.

శాస్త్రవేత్తలు బొద్దింక పాలను సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, నట్స్ లో ఉన్నట్టే బొద్దింక పాలలో కూడా చాలా పోషకాలు ఉన్నాయని అంటున్నారు. కానీ వాస్తవానికి బొద్దింక విడుదల చేసేది పాలు కాదు. పసుపు రంగులో ఉండే ద్రవం. ఇది గట్టిపడి స్ఫటికాల రూపాన్ని తీసుకుంటుంది. ఆ స్పటికాలనే బొద్దింక పాలగా పరిగణిస్తారు.

సూపర్ ఫుడ్ అనే పదాన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో కేలరీల...